భారతదేశం, మే 4 -- త్వరలో విశాఖ నగరవాసులు, పర్యాటకులు అడవి అందాలను, ప్రకృతి బాటలను ఆస్వాదించడానికి మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో రాత్రిపూట బస చేసే (Night-stay) ఎకో-టూరిజం కార్యకలాపాలను ప్రారంభించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీనివల్ల నగర హద్దుల్లోనే పర్యాటకులు అడవి అనుభూతిని పొందే అవకాశం కలుగుతుంది.
తూర్పు కనుమల మధ్య, నగరానికి ఆనుకుని ఉన్న కంబాలకొండను భారత ప్రభుత్వ 'నగర్ వన్ యోజన' కింద ఆధునీకరిస్తున్నారు. దాదాపు 71 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యం, అరుదైన జీవవైవిధ్యంతో పాటు ప్రకృతి ఆధారిత వినోదాన్ని అందిస్తూ ప్రధాన పర్యాటక కేంద్రంగా ఎదుగుతోంది.
కంబాలకొండను రూ. 2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఇక్కడికి రోజుకు 200 మందికి పైగా, వారాంతాల్లో 500 మంది వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.