భారతదేశం, మే 25 -- ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అక్కడ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఈ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జారీ చేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రత్యేక మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధమైందని మంత్రి ప్రకటించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే సమర్థంగా ఎదుర్కొనేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.

ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా దేశాల్లో...