భారతదేశం, మే 17 -- ప్రపంచాన్ని మరో ప్రమాదకరమైన వైరస్ ముప్పు వణికిస్తోంది! డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో వేగంగా విస్తరిస్తున్న ఎబోలా వైరస్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) అత్యున్నత స్థాయి అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా (Public Health Emergency of International Concern - PHEIC) ప్రకటించింది. ఆదివారం (మే 17) డబ్ల్యూహెచ్‌ఓ ఈ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని జారీ చేసింది. 2024లో ఎంపాక్స్​కు ఈ స్థాయి హెచ్చరిక ఇచ్చిన తర్వాత.. మళ్లీ అంతటి తీవ్రమైన అలర్ట్​ని జారీ చేయడం ఇదే మొదటిసారి.

ప్రకటనతో ఎబోలా సంక్షోభం కూడా కోవిడ్-19 కేటగిరీ లాంటి అంతర్జాతీయ ముప్పుల జాబితాలోకి చేరింది. దీనివల్ల అత్యవసర నిధులు విడుదల కావడంతో పాటు అంతర్జాతీయ సమన్వయం వేగవంతం కానుంది.

ప్రస్తుతం ఆఫ్రికాలో వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ అత్యంత అరుదైన 'బుందిబుగ్...