భారతదేశం, ఏప్రిల్ 6 -- తాను పార్టీ మారుతున్నానంటూ కొంతమంది అనవసరమైన పోస్టర్ లు వేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి 5 ఏళ్ల అవుతుందని. ఆ తర్వాత బీజేపీలో చేరానని గుర్తు చేశారు. పార్టీలు మారడమంటే బట్టలు మార్చినంత ఈజీ కాదన్నారు.

"నా గురుంచి తెలంగాణ సమాజానికి తెలుసు. ఇలాంటి ఫేక్ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. ఈటలను పొగుట్టుకుని కేసీఆర్ తప్పు చేశారని ప్రజలు అంటున్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో ఈటల.. కేసీఆర్ తో కలుస్తారు అని కొందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేయవద్దని చెబుతున్నాను. నాడు నన్ను బర్తరఫ్ చేయడమే కాకుండా నన్ను ఇబ్బందులు గురిచేశారు. ఆయన చేయని పనిలేదు. కోళ్ళ ఫార్మ్ లు...