Eastern Ghats : తూర్పు కనుమల్లో తలకిందులుగా ఈదే కొత్త కీటకం గుర్తింపు!
భారతదేశం, నవంబర్ 20 -- జీవవైవిధ్య పరిశోధనల్లో శాస్త్రవేత్తలు మరో కీలక ముందడుగు వేశారు. తూర్పు కనుమల (Eastern Ghats) పరిధిలోని మంచినీటి ఆవాసాల్లో నీటి ఉపరితలం కింద తలకిందులుగా ఈదే విలక్షణ లక్షణం కలిగిన ఒక కొత్త జల కీటకాన్ని పరిశోధకులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతాల్లో ఈ కొత్త కీటక జాతిని కనుగొన్నారు.
దక్కన్ పీఠభూమి ప్రాంతంలోని తూర్పు కనుమల్లో గుర్తించినందున ఈ కొత్త కీటక జాతికి 'ఎనిథారెస్ డెక్కనెన్సిస్' (Enithares deccanensis Banerjee et al, 2026) అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఇది నోటోనెక్టిడే కుటుంబానికి చెందినది. సాధారణ భాషలో వీటిని 'బ్యాక్‌స్విమ్మర్స్' అని పిలుస్తారు. నీటిలో తలకిందులుగా ఉండి, తెడ్డు మాదిరిగా ఉండే తమ పొడవైన వెనుక కాళ్ల సాయంతో అత్యంత వేగంగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.