భారతదేశం, మే 2 -- Dwidwadasha Yogam : గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. వాటి సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ద్రిక్ పంచాంగం ప్రకారం సూర్యుడు, శుక్రుడు ముప్పై డిగ్రీల దూరంలో ఉంటారు.

ఇది ద్విద్వాదశ యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం కారణంగా 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కొన్ని రాశుల వారి అదృష్టం పెరుగుతుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

వృషభ రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. కెరీయర్లలో అద్భుతమైన మార్పులను చూస్తారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. మంచి నిర్ణయాల...