భారతదేశం, నవంబర్ 21 -- Drones OTT Trending: థియేటర్లలో విడుదలైనప్పుడు తగినన్ని స్క్రీన్లు దొరక్కపోయినా, ఓటీటీలోకి రాగానే అదరగొడుతున్న సినిమాల జాబితాలో 'డ్రోన్స్' చేరిపోయింది. సిద్ధి ఇద్నానీ, అంజలి నాయర్, దేవదర్శిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం నవంబర్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

డిజిటల్ వేదికపై అడుగుపెట్టిన ఒక్క రోజులోనే డ్రోన్స్ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోని రొమాన్స్ మూవీస్ విభాగంలో ఏకంగా నంబర్ 2 స్థానంలో ట్రెండ్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది డ్రోన్స్ మూవీ. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీగా వ్యూస్ వస్తున్నాయి.

'బన్ బటర్ జామ్' సినిమాతో గుర్త...