భారతదేశం, ఆగస్టు 25 -- Drishyam 4: మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులు సృష్టించిన ఫ్రాంఛైజీ 'దృశ్యం'. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి మరో మైండ్ బ్లాస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. 'దృశ్యం 3' థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన తర్వాత, ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో నాలుగో భాగం (Drishyam 4) నిర్మించడానికి మేకర్స్ పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారు.

ఇటీవల 'మళవిల్ మనోరమా' నిర్వహించిన ఒక వేడుకలో పాపులర్ మలయాళ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ ఈ విషయమై అధికారిక ప్రకటన చేశారు. "దృశ్యం 4 కచ్చితంగా తెరకెక్కుతుంది. మోహన్‌లాల్ మళ్లీ జార్జ్‌కుట్టి పాత్రలో అలరిస్తారు. ఇది నా హృదయం లోపలి నుంచి వస్తున్న నిజం" అని ఆంటోనీ స్పష్టం చేశారు.

ఇటీవల మోహన్‌లాల్ ఏడుగురు వేర్వేరు దర్శకులతో చేయబోయే ఏడు సినిమాల వివరాలను పంచుకున్నారు. ఆ జాబితాలో 'దృశ్యం' ...