భారతదేశం, జూన్ 17 -- Drishyam 3 Telugu OTT Stay: మలయాళంలో ఇండస్ట్రీ హిట్ సాధించిన 'దృశ్యం' ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మొదటి రెండు భాగాలు తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ అయి ఇక్కడ కూడా బ్లాక్‌బస్టర్స్ గా నిలిచాయి. అయితే ఈ మూడో భాగాన్ని మాత్రం తెలుగులో రీమేక్ చేయకుండా, నేరుగా మలయాళ వర్షన్ తో పాటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

జూన్ 18న (గురువారం) ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్రాండ్ గా రిలీజ్ కావాల్సి ఉంది. సరిగ్గా స్ట్రీమింగ్ కు కొన్ని గంటల ముందే ఈ సినిమా తెలుగు వర్షన్ పై కోర్టు స్టే ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

'దృశ్యం' మొదటి భాగాన్ని తెలుగులో వెంకటేష్, మీనా లీడ్ రోల్స్ లో డైరెక్టర్ శ్రీప్రియ (Sripriya) రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'ద...