భారతదేశం, మే 22 -- Drishyam 3 Movie First Day Box Office Collection: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ 'దృశ్యం 3' మే 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. మోహన్ లాల్ 66వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం, రెండో భాగం సాధించిన అద్భుత విజయాల తర్వాత వచ్చిన ఈ మూడో భాగం తొలి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ఖాతా తెరిచింది.

తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ ఫ్రాంచైజీతో విడదీయరాని బంధం ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ అయిన 'దృశ్యం' సినిమాలు ఇక్కడ కూడా సంచలన విజయాలు సాధించాయి. అందుకే మలయాళ మూల చిత్రం 'దృశ్యం 3' తెలుగు వర్షన్‌పై కూడా ఇక్కడి సినీ ప్రియులు గట్టి ఆశలే పెట్టుకున్నారు.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'దృశ్యం 3' మొదటి రోజు భారతదేశ...