భారతదేశం, మే 24 -- Drishyam 3 Movie 3 Days Worldwide Box Office Collection: భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త ట్రెండ్‌ సెట్ చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'దృశ్యం'. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన 'దృశ్యం 3' మే 21న మలయాళ సూపర్ స్టార్ పుట్టినరోజు కానుకగా థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు నుంచే భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం వారాంతంలో బాక్సాఫీస్ వద్ద మరింత పట్టు సాధించింది.

మలయాళంలో విడుదలైన ఈ మూడో భాగానికి తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఆదరణ లభిస్తోంది. సౌత్ ఇండియాలో తమిళం, కన్నడ భాషలతో పోలిస్తే తెలుగులోనే దృశ్యం 3 చిత్రానికి అత్యధిక వసూళ్లు రావడం విశేషంగా మారింది.

ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, 'దృశ్యం 3' మూడో రోజైన శనివారం (మే 23) ఒక్కరోజే భారతదేశంలో దాదాపు రూ. 13.70 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింద...