భారతదేశం, అక్టోబర్ 4 -- Drishyam 3: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3' (Drishyam 3) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా కేవలం హిందీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా, మలయాళ ప్రేక్షకులను, కంటెంట్ క్రియేటర్లను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది.

అజయ్ దేవగన్, అభిషేక్ పాఠక్ కాంబినేషన్‌లో వచ్చిన 'దృశ్యం 3' చిత్రం శుక్రవారం (అక్టోబర్ 2) థియేటర్లలోకి వచ్చి అంచనాలను మించి సంచలనం సృష్టిస్తోంది. Sacnilk నివేదికల ఆధారంగా ఈ సినిమా మొదటి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.66.75 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 95.10 కోట్ల గ్రాస్ సాధించి అజయ్ దేవగన్ సినీ ప్రయాణంలోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.

దృశ్యం 3 హిందీ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. ఈ సి...