భారతదేశం, ఏప్రిల్ 13 -- తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు 2026-27 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణ రెడ్డి మూడు దశల ప్రవేశ ప్రక్రియను వివరిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం.. మొదటి దశ రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 15 నుండి మే 7 వరకు, వెబ్ ఆప్షన్లు ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు అందుబాటులో ఉంటాయి. మొదటి దశ సీట్ల కేటాయింపును మే 14న ప్రకటిస్తారు, ఆ తర్వాత మే 15 నుండి మే 23 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్-రిపోర్టింగ్ ఉంటుంది.

రెండో దశ రిజిస్ట్రేషన్లు మే 15 నుండి మే 25 వరకు జరుగుతాయి. వెబ్ ఆప్షన్లు మే 26 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ దశకు సీట్ల కేటాయింపు మే 30న జరగనుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ మే 31 నుండి జూన్ 5 వరకు జరుగ...