భారతదేశం, నవంబర్ 11 -- Dorothy Jeeva subramaniam: కొన్ని సినిమాలు ఆడియన్స్ కు ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తాయి. కొన్ని మూవీస్ మెసేజ్ ను అందిస్తాయి. కానీ కొన్ని మాత్రం ఆ సినిమాలో నటించిన నటీనటుల జీవితాలను మార్చేస్తాయి. ఇప్పుడు డోరతీ మూవీ కూడా అలాంటిదే. ఈ మూవీలో నటించిన ట్రాన్స్‌జెండ‌ర్‌ జీవా సుబ్రహ్మణ్యం కథ కూడా అలాంటిదే.

ట్రాన్స్‌జెండ‌ర్‌ జీవా సుబ్రహ్మణ్యం 'డోరతీ' మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమాతో తన జీవితమే మారిపోయిందని జీవా ఎమోషనల్ అయింది. తన లైఫ్ లోకి వెలుగులు వచ్చాయని దీపావళి పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

కుటుంబాన్ని ఎదురించి నిలబడిన ఓ ట్రాన్స్‌జెండ‌ర్‌ కథతో తెరకెక్కిన మూవీ 'డోరతీ'. ఈ సినిమా తన జీవితాన్ని ఎలా మార్చిందో జీవా చెప్పుకొచ్చింది. ''నాకు ఇంకా ఊహ తెలియని వయసులో, నాకు...