భారతదేశం, ఏప్రిల్ 25 -- Divi: విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తూ, నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా బిగ్ బాస్ బ్యూటీ దివి సాగిపోతోంది. తాజాగా ఆమె నటిస్తున్న 'క్యాస్ట్' మూవీ నుంచి దివి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
కుల వ్యవస్థ, సమాజంలో కులం పేరుతో జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టే విధంగా తెరకెక్కిస్తున్న మూవీ 'క్యాస్ట్'. ఇందులో దివి ఓ హీరోయిన్ గా నటిస్తోంది. ఇవాళ (ఏప్రిల్ 25) దివి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె పవర్ ఫుల్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
పెద్ద బొట్టుతో, మెడలో పులి గోర్లతో ఆమె రూపం భయపెట్టేలా ఉంది. క్యాస్ట్ సినిమాలో ఆమె ధూమవతి క్యారెక్టర్ ప్లే చేస్తుందని కూడా అనౌన్స్ చేశారు. ''టాలెంటెడ్ నటి దివికి క్యాస్ట్ మూవీ టీమ్ తరపున జన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.