భారతదేశం, అక్టోబర్ 5 -- పండుగ సీజన్ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆటోమొబైల్ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్లతో వల విసురుతున్నాయి. ఇందులో భాగంగా జపాన్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా అక్టోబర్ 2026 నెలకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. తమ పాపులర్ ఎస్‌యూవీ 'ఎలివేట్'తో పాటు మార్కెట్లో క్రేజ్ ఉన్న 'సిటీ', 'అమేజ్' మోడళ్లపై కంపెనీ భారీ తగ్గింపులను ఇస్తోంది.

ఈ పండుగ వేళల్లో మీరు కూడా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. అక్టోబర్ 2026లో హోండా ఇస్తున్న డిస్కౌంట్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

హోండా పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత భారీ ఆఫర్‌ను 'ఎలివేట్' ఎస్‌యూవీకి కేటాయించారు. ఈ కారుపై ఏకంగా రూ. 2,34,600 వరకు ప్రయోజనాలను అందుకోవచ్చు. ఎలివేట్ ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్‌లో రూ. 11.81 లక్షలుగా ఉంది. కారు ప్రాథమిక ధరతో పోల్చి చూస్తే...