భారతదేశం, సెప్టెంబర్ 9 -- Director Dhurandhar: బాలీవుడ్‌లో 'పాన్ సింగ్ తోమర్', 'హాసిల్' వంటి నేషనల్ అవార్డు పొందిన సినిమాలను తెరకెక్కించిన పాపులర్ దర్శకుడు, నటుడు తిగ్మాన్షు ధులియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ సినిమా ప్రస్తుత ట్రెండ్‌పై హాట్ కామెంట్లు చేశాడు. దీంతో ఆయనపై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి.

కార్పొరేట్ కల్చర్, ఎక్స్‌ట్రీమ్ క్యాపిటలిజం సినిమా రంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో వివరిస్తూ డైరెక్టర్ తిగ్మాన్షు చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో వచ్చిన అతిపెద్ద ఫ్రాంచైజ్ చిత్రాలైన 'కేజీఎఫ్', 'పుష్ప', 'ధురంధర్' చిత్రాలపై అతని వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఈ సినిమాలన్నీ ఒకే రకమైన టెంప్లేట్‌తో రూపుదిద్దుకుంటున్న 'ఫిక్షనల్ బయోపిక్స్' మాత్రమేనని, వాటిలో నిజమైన కథలు కరువయ్యాయని అతనన్నాడు.

ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నిర్వ...