భారతదేశం, ఆగస్టు 24 -- Dil Raju Yash: కేజీఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నిర్ణయం చూసి ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు మైండ్ బ్లాక్ అయిపోయింది. హైదరాబాద్‌లో జరిగిన 'టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజు స్టేజ్ మీదే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్ 2 తర్వాత యశ్.. గీతు మోహన్‌దాస్‌తో సినిమా అనగానే అతనికి పిచ్చెక్కిందేమో అని అనుకున్నానని దిల్ రాజు ఓపెన్‌గా చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో 'టాక్సిక్' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు ఈ ఈవెంట్‌లో తన మనసులోని మాటను బయటపెట్టారు. కేజీఎఫ్ తర్వాత యశ్ ఇంకా పెద్ద ప్రాజెక్ట్ చేస్తాడని ప్రతి ఒక్కరూ అనుకున్నారని, కానీ గీతు మోహన్‌దాస్ పేరు చెప్పగానే అందరికీ డౌట్ వచ్చిందని అన్నారు. అయితే ముంబైలో ఈ సినిమా విజువల్స్ చూశాక యశ్ విజన్ ఏంటో అర్థమై...