భారతదేశం, ఆగస్టు 30 -- Dil Raju Released Missing Meghana Second Lyrical Song: తెలుగులో వస్తున్న సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా మిస్సింగ్ మేఘన. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి అండ్ కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే, మిస్సింగ్ మేఘన మూవీకి వాచస్పతి దర్శకత్వం వహించారు.

మిస్సింగ్ మేఘన సినిమాలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేయగా.. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించారు.

ఇటీవల మిస్సింగ్ మేఘన సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదు...