భారతదేశం, సెప్టెంబర్ 20 -- Dil Raju: తెలుగులో సూపర్ డూపర్ హిట్స్ తో టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా ఎదిగిన దిల్ రాజు పేరు ఇప్పుడు సోసల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. తన ప్రొడక్షన్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ గణపతి నిమజ్జనంలో ఆయన మాస్ డ్యాన్స్ చేయడమే అందుకు కారణం. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

వినాయక నిమజ్జన వేడుకల్లో దిల్ రాజు డ్యాన్స్ వైరల్ గా మారింది. ఆయన మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. తన ఆఫీస్ స్టాఫ్, సన్నిహితులతో కలిసి దిల్ రాజు డ్యాన్స్ చేశారు. ఆయన చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. జోష్ తో డ్యాన్స్ చేశారు. ఆయన భార్య తేజస్విని కూడా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు.

దిల్ రాజు, ఆయన భార్య తేజస్విని డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. వీళ్ల డ్యాన్స్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున...