భారతదేశం, మే 16 -- Dil Raju: తెలుగు సినీ పరిశ్రమలో వందలాది చిత్రాల్లో నటించి తనదైన నటనతో మెప్పించిన సీనియర్ నటి పావలా శ్యామల తీవ్ర అనారోగ్యంతో, అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నారంటూ శనివారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమెకు దిల్ రాజు అండగా నిలిచాడు.

నడి రోడ్డు మీద పావలా శ్యామల దీనస్థితిలో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఆమెను పట్టించుకునేవారే లేరని, తీవ్ర గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తక్షణమే స్పందించాడు.

పావలా శ్యామలకు మెరుగైన వైద్యం అందేలా చూసేందుకు దిల్ రాజు తన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించాడు. కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్ కు చేరుకున్న దిల్ రాజు బృందం సభ్యులు, అ...