భారతదేశం, మార్చి 23 -- Dil Raju: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో మూవీ, మరో పక్క కొత్తదనానికి మారుపేరుగా నిలిచే తరుణ్ భాస్కర్ లీడ్ రోల్లో నటించిన సినిమా.. ఈ ఇద్దరి సినిమాల చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చే నడుస్తోంది. తరుణ్ భాస్కర్ నటిస్తున్న కొత్త సినిమా 'గాయపడ్డ సింహం' విడుదల తేదీని మే 1గా అధికారికంగా ప్రకటించారు. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందే, అంటే ఏప్రిల్ 30వ తేదీన రామ్ చరణ్ నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా 'పెద్ది' థియేటర్లలోకి రాబోతోంది. దీంతో నెట్టింట జనాలంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. దీనిపై దిల్ రాజు క్లారిటీ ఇస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

పెద్ది మూవీతో గాయపడ్డ సింహం పోటీ పడుతుందా అన్న అనుమానాలను నిర్మాత దిల్ రాజు ముందుగానే పటాపంచలు చేశాడు. ఒకవేళ పెద్ది అనుకున్న ప్రకారమే వస్తే.. సింహం పక్కకు జరగాల్సి...