భారతదేశం, మే 7 -- Dibyendu Bhattacharya: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిభ కంటే రంగుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా వెర్సటైల్ యాక్టర్ దివ్యేందు భట్టాచార్య చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరోసారి తెరపైకి తెచ్చాయి. బాలీవుడ్‌లో వర్ణ వివక్ష (Racism) అనేది చాలా లోతుగా పాతుకుపోయిన సమస్య అని, ఇది నటీనటుల ఎంపికపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన కుండబద్దలు కొట్టాడు.

కేవలం నలుపు రంగులో ఉన్నాననే కారణంతో ఒక పెద్ద యాడ్ ఫిల్మ్ నుంచి తనను అర్ధాంతరంగా తొలగించారని దివ్యేందు భట్టాచార్య వెల్లడించాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సినిమా రంగంలో ఇప్పటికీ చర్మం రంగును బట్టే అవకాశాలు ఇస్తున్నారని బాలీవుడ్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టాడు.

తనకు ఎదురైన చేదు అనుభవాన్ని దివ్యేందు వివరిస్తూ.. "ఇది చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య. కొన్ని ...