భారతదేశం, ఆగస్టు 5 -- తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవల విభాగంలో కీలక మార్పు జరిగింది. ప్రజలకు ఎప్పటినుంచో సేవలు అందిస్తున్న డయల్ 100 వ్యవస్థ స్థానంలో హెల్ప్‌లైన్ నంబర్ 112 (Dial 112) ను తెలంగాణ పోలీస్ శాఖ అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ సీ.వీ.ఆనంద్ కొత్త ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ డయల్ 112 సేవలను అధికారికంగా ప్రారంభించారు.

100తో పోలీస్ సాయం అందేది. అయితే ఈ కొత్త నెంబర్‌తో పోలీస్ సాయంతో పాటుగా అంబులెన్స్, అగ్నిమాపక (ఫైర్) సేవలను ఒకే ఒక్క అత్యవసర నంబర్ ద్వారా పొందవచ్చు. ఇంతకుముందు వరకు రాష్ట్రంలో పోలీస్ సాయం కోసం 100, వైద్య అత్యవసర పరిస్థితి కోసం 108, అగ్నిమాపక సేవలకు 101 వంటి వేర్వేరు నంబర్లు ఉండేవి.

ఆపద సమయంలో వేర...