భారతదేశం, జూన్ 15 -- Dia Mirza On Climate Change Cause Men: ప్రకృతిని కాపాడుకోవాలంటూ సుద్దులు చెప్పే సెలబ్రిటీల మాటలు కొన్నిసార్లు ఎంతటి వివాదాలకు దారితీస్తాయో మరోసారి రుజువైంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి తరఫున ప్రచారం చేసే గుడ్‌విల్ అంబాసిడర్‌గా, బాలీవుడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న దియా మీర్జా తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.

ప్రపంచాన్ని పీడిస్తున్న వాతావరణ మార్పులకు (Climate Change) పురుషుల అహంకారం, పురుషాధిక్య వ్యవస్థే (Patriarchy) కారణమంటూ దియా మీర్జా సంచలన ఆరోపణలు చేశారు.

నటి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న 'ఆల్ అబౌట్ హర్' అనే పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పర్యావరణ జర్నలిస్ట్ ఆరతి కుమార్-రావుతో కలిసి దియా మీర్జా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాతావరణ మార్పులపై చర్చ సాగుతుండగా దియా మీర్జా సంచలన వ్య...