భారతదేశం, జూలై 19 -- Dhyan Sreenivasan Satires On CM Vijay Again: మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతోనే కాకుండా, అంతకంటే మిన్నగా తన వివాదాస్పద, హాస్యభరిత ఇంటర్వ్యూలతో గుర్తింపు తెచ్చుకున్న హీరో ధ్యాన్ శ్రీనివాసన్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. ధ్యాన్ శ్రీనివాసన్ మరోసారి కోలీవుడ్ దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను టార్గెట్ చేస్తూ వరుస వేదికపై సెటైర్లు వేశారు.

కేరళకు కాబోయే ముఖ్యమంత్రిని నేనేనంటూ ఒక అవార్డుల వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ రాజకీయాల్లోకి రావడం, ముఖ్యమంత్రి కావడం వంటి పరిణామాలు సౌత్ ఇండియాలోనే పెద్ద సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రానికి చెందిన హీరో ధ్యాన్ బహిరంగ వేదికలపై సీఎం విజయ్ శైలిని అనుకరిస్తూ జోకులు పేల్చడం గమనార్హం.

ఇటీవల జరిగిన 'స్టార్ అండ్ సక్సెస్ అవా...