భారతదేశం, మార్చి 19 -- నెలల తరబడి సాగిన నిరీక్షణ, సోషల్ మీడియాలో భారీ హైప్.. వీటన్నింటి మధ్య ఆదిత్య ధర్ ప్రతిష్టాత్మక స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar 2) మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బుధవారం (మార్చి 18) సాయంత్రం నుంచే వందలాది ప్రివ్యూ షోలు పడటంతో, అర్ధరాత్రి కల్లా సోషల్ మీడియా వేదికగా రివ్యూలు వెల్లువెత్తాయి.

భారీ అంచనాలను అందుకోవడం ఏ సినిమాకైనా కత్తిమీద సామే.. కానీ, 'ధురంధర్ 2' ఆ అంచనాలను వందశాతం అందుకుందని పలు రివ్యూవర్లు చెబుతున్నారు. అలాగే, ప్రివ్యూ షోలు చూసిన ప్రేక్షకులు, విమర్శకులు ధురంధర్ 2 సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

కొందరైతే ఏకంగా ఇది 'భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యుత్తమ చిత్రం' అని అభివర్ణిస్తున్నారు. "ఇంటర్వెల్‌కే మైండ్ బ్లాక్ అయిపోయింది. మేకింగ్, మ్యూజిక్ సినిమాను మరో లెవల్‌కు...