భారతదేశం, మార్చి 23 -- ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వడానికి ఇంకో ఆరు రోజులే టైమ్ ఉంది. కానీ ఇప్పుడు దేశమంతా రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ ద రివెంజ్' గురించే మాట్లాడుకుంటోంది. గత వారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులన్నీ బద్దలు కొడుతూ కాసుల వర్షం కురిపిస్తోంది. జనాలు ఎగబడి చూస్తుండటంతో థియేటర్ల దగ్గర టికెట్లు దొరకడం చాలా కష్టంగా మారింది. క్రికెట్ లెజెండ్, 1983 వరల్డ్ కప్ విన్నర్ సునీల్ గవాస్కర్‌కు కూడా ఈ సినిమా టికెట్లు దొరకలేదంటే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆయన టికెట్ల కోసం సినిమాలో నటించిన ఒక యాక్టర్‌ను బతిమాలాల్సి వచ్చింది.

ధురంధర్ 2 సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేసిన సీనియర్ నటుడు రాకేష్ బేడీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేశాడు. సినిమాలో ఉన్న సస్...