భారతదేశం, మార్చి 10 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ మూవీ'ధురంధర్ 2' (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడానికి సిద్ధమైంది. ధురంధర్ ది రివేంజ్ సినిమా విడుదలకు ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉన్నప్పటికీ, అప్పుడే టికెట్ల వేట మొదలైంది.

మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ధురంధర్ 2 అంతకంటే ముందు రోజు అంటే మార్చి 18 సాయంత్రం 4-5 గంటల నుంచి భారత్ అంతటా ఎంపిక చేసిన థియేటర్లలో 'పెయిడ్ ప్రివ్యూస్' ద్వారా సందడి చేయనుంది.

ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేటర్ యాజమాన్యాలు ధురంధర్ 2 టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. మెట్రో నగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో సాధారణ టికెట్ ధర రూ. 600 నుంచి రూ. 900 వరకు ఉండగా, ఐమాక్స్ (IMAX) షోల ధర రూ. 1000 దాటేసింది.

ఇక లగ్జరీ సీట్లు, రెక్లైనర్ల ధరలు చూస్తే సామాన్యుడికి దిమ్మత...