భారతదేశం, ఏప్రిల్ 12 -- Dhurandhar 2 Song: బాలీవుడ్ క్లాసిక్ చిత్రం 'త్రిదేవ్'లోని ఎవర్‌గ్రీన్ సాంగ్ 'ఓయ్ ఓయ్.. తిర్చి టోపీవాలే' సాంగ్ ను ధురంధర్ 2లో వాడటం వివాదానికి దారితీసింది. గత నెలలో విడుదలైన 'ధురంధర్: ది రివెంజ్' సినిమాలో ఈ పాటను అనుమతి లేకుండా వాడుకున్నారంటూ త్రిదేవ్ దర్శకుడు, ప్రముఖ నిర్మాత రాజీవ్ రాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆయన కోర్టును ఆశ్రయించగా, తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిత్ర యూనిట్‌పై విరుచుకుపడ్డారు.

ధురంధర్ 2లో తిర్చి టోపీవాలే సాంగ్ వాడటంపై రాజీవ్ రాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఇది పక్కా దొంగతనం. ఒకరి పాటను దొంగలించి, దాన్ని మార్చి మరో సినిమాలో వాడుకోవడం అనేది డబుల్ చోరీ కిందకే వస్తుంది. నా దృష్టిలో ఇది నేరం. కోర్టులో వారు తాము దొంగతనం చేయలేదని వాదించవచ్చు.

కానీ నేరం జరిగింది కాబట్టే నేను కో...