భారతదేశం, మార్చి 18 -- సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఒక సినిమా నచ్చితే దానిని ఆకాశానికి ఎత్తేయడం ఆయన శైలి. తాజాగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్ 2: ది రివెంజ్' ప్రివ్యూ చూసిన రామ్ గోపాల్ వర్మ ధురంధర్ 2పై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

ధురంధర్ 2పై రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా చేసిన నటించిన ఈ చిత్రం మొదటి భాగం ధురంధర్ సృష్టించిన ప్రభంజనాన్ని మించిపోనుందని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.

ఆర్జీవీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. "గతరాత్రి 'ధురంధర్ 2' చూశాను. బాక్సాఫీస్ వసూళ్లు, ప్రేక్షకుల ఉత్సాహం, సామాజిక ప్రభావం.. ఇలా ఏ కోణంలో చూసినా ఇది అద్భుతం. దీని ఆడియో విజువల్ ఇంపాక్ట్ 'షోలే' కంటే 100 రెట్లు ఎక్కువ...