భారతదేశం, ఏప్రిల్ 20 -- Dhurandhar 2 OTT Release: బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్న రణ్‌వీర్ సింగ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar 2) ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోనూ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. థియేటర్లలో రూ. 1600 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన ఈ మూవీ.. భారీ ధరకు ఓటీటీ డీల్‌ను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్ ఏకంగా రూ. 150 కోట్లు ఇచ్చిందట.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇండియాలో రూ. 1000 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి హిందీ మూవీగా 'ధురంధర్ 2' రికార్డు సృష్టించింది.

రణ్‌వీర్ సింగ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ప్రే...