భారతదేశం, మే 15 -- Dhurandhar 2 OTT Release: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ డ్రామా 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge) ఓటీటీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఖరారైంది. అయితే ఈ ప్రకటనతో పాటు ఒక ఆసక్తికరమైన చిక్కుముడి కూడా వచ్చి పడింది.

ఇండియాలో ధురంధర్ 2 సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న జియోహాట్‌స్టార్ (Jio Hotstar).. ఈ చిత్రాన్ని జూన్ 4 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ (IPL) సీజన్ ముగిసిన తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ తేదీని ఖరారు చేశారు.

ఓటీటీలో రాబోతున్న ఈ వెర్షన్ నిడివి ఏకంగా 3 గంటల 52 నిమిషాలు. థియేటర్లో కట్ చేసిన అనేక కీలక సన్నివేశాలను కలిపి 'స్పెషల్ ఎక్స్‌టెండెడ్ ఎడిషన్'గా దీనిని విడుదల చేస్తున్నారు. రణవీర్ ...