భారతదేశం, జూన్ 5 -- Dhurandhar 2 OTT Release: బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్ సింగ్ సరికొత్త యాక్షన్ అవతార్‌లో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'ధురంధర్: ది రివెంజ్' ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌లో ఈ మూవీ ఇప్పుడు సరికొత్త హంగులతో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన వెర్షన్ కంటే.. బోనస్ ఫుటేజ్ యాడ్ చేసి మరీ డిజిటల్ ఆడియన్స్‌కు పక్కా యాక్షన్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్.

జియోహాట్‌స్టార్ మొదట ధురంధర్ 2 సినిమాను సరికొత్తగా 'లైవ్ స్ట్రీమింగ్ ప్రీమియర్' పద్ధతిలో రిలీజ్ చేసింది. అంటే మనం టీవీలో సినిమా చూసినట్లు.. వాళ్లు ఫిక్స్ చేసిన టైమ్‌కి మాత్రమే సినిమా లైవ్ టెలికాస్ట్ అయ్యేలా ప్లాన్ చేశారు.

అయితే ఈ వింత ప్రయోగం నెటిజన్లకు విపరీతమైన కోపం తెప్పించింది. "డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకు...