భారతదేశం, మే 14 -- Dhurandhar 2 OTT: బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్ల ప్రభంజనం సృష్టించిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ చిత్రం 'ధురంధర్ 2: ది రివెంజ్' ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్లలో రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం 'ధురంధర్ ది రివెంజ్ (రా అండ్ అన్ దేఖ)' అనే టైటిల్‌తో ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కోసం సినీ లవర్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ మరికొన్ని గంటల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు అర్దరాత్రి 12 గంటల నుంచి ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

అయితే ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ లో ట్విస్ట్ నెలకొంది. ఈ చిత్రం విదేశీ ఓటీటీ రైట్స్ ను పాపులర్ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. ఇండియాలో స్ట్రీమింగ్ హక్కులను మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్ట...