భారతదేశం, మే 16 -- Dhurandhar 2 OTT: థియేటర్లలో భారీ వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించిన బాలీవుడ్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్, సరిహద్దులు దాటి మరీ తన క్రేజ్‌ను చాటుకుంటోంది.

స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 ఓటీటీలో అదరగొడుతోంది. అంతర్జాతీయంగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ ప్రీమియర్ అవుతున్న ఈ చిత్రానికి పొరుగు దేశమైన పాకిస్థాన్ లో ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ లభిస్తోంది. అక్కడ ట్రెండింగ్ నంబర్ వన్ లోకి మూవీ దూసుకెళ్లింది.

ధురంధర్ 2 అంతర్జాతీయంగా విడుదలైన కొద్దిసేపటికే పాకిస్థాన్ లో నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయని, విపరీతమైన ట్రాఫిక్ కారణంగా...