భారతదేశం, మే 15 -- Dhurandhar 2 OTT: బాక్సాఫీస్ ను షేక్ చేసి, రికార్డుల మోత మోగించిన ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కోసం సినీ లవర్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందా? అని ఆత్రుతతో ఉన్నారు. కానీ ఇండియన్ ఓటీటీ ఆడియన్స్ కు షాక్ తప్పలేదు. ఈ మూవీ ఇండియాలో ఇంకా ఓటీటీ రిలీజ్ కాలేదు.

ధురంధర్ 2 ఓటీటీ విషయంలో ఇండియన్ మూవీ లవర్స్ కు షాక్ తగిలింది. ర‌ణ్‌వీర్ సింగ్‌ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇండియాలో ఓటీటీ రిలీజ్ కాలేదు. అదే సమయంలో విదేశాల్లో మాత్రం స్ట్రీమింగ్ షురూ అయింది. ఇతర దేశాల్లో ఓటీటీలోకి వచ్చేసింది ధురంధర్ 2.

ధురంధర్ 2 ఓటీటీ రైట్స్ ను రెండు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ దక్కించుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌, జియోహాట్‌స్టార్‌ ఈ హక్కులను సొంతం చేసుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ ఏమో ఓవర్సీస్ ఓటీటీ రైట్...