భారతదేశం, ఫిబ్రవరి 28 -- భారతీయ చలనచిత్ర రంగంలో 2026లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాల్లో 'ధురంధర్ 2' ఒకటి. రణ్‌వీర్ సింగ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ రూపొందిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ గురించి తాజాగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ధురంధర్ 2 ది రివేంజ్ సినిమాలో డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య, హీరోయిన్ యామీ గౌతమ్ అతిథి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, న్యూస్ 18 రైజింగ్ భారత్ సమ్మిట్ 2026లో పాల్గొన్న యామీ గౌతమ్ ధురంధర్ 2 మూవీపై ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.

యామీ గౌతమ్ ఇప్పటికే 'ధురంధర్ 2' చూశారట. సినిమా చూశాక తన అనుభూతిని పంచుకుంటూ ధురంధర్ ది రివేంజ్ సినిమాపై డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య యామీ గౌతమ్ రివ్యూ ఇచ్చారు.

"నేను ఇప్పటికే ధురంధర్ 2 చూశాను. ఇది ఒక అసాధారణమైన చిత్రం. సినిమా చూశాక నే...