భారతదేశం, మార్చి 28 -- ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది. రెండో వారంలోనూ ఈ సినిమా కలెక్షన్ల మోతో మోగిస్తోంది. ధురంధర్ 2 తొమ్మిది రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ను ఇక్కడ చూసేయండి.

రణ్‌వీర్‌ సింగ్ లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ధురంధర్ 2 బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. ఈ సినిమా తొమ్మిదో రోజైన శుక్రవారం (మార్చి 27) కూడా కలెక్షన్లలో అదరగొట్టింది. దేశవ్యాప్తంగా 18,456 షోల ద్వారా ఏకంగా రూ.41.55 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. మార్చి 19న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.

ఈ తాజా వసూళ్లతో కలిపి తొమ్మిది రోజుల్లో భారతదేశంలో ధురంధర్ 2 మొత్తం నెట్ కలెక్షన్ రూ.715.72 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ వసూళ్ల విషయానికి వస్తే, ఈ సినిమా ఇప్పటికే రూ.854.99 కోట్లను దాటేసింది. కేవల...