భారతదేశం, మార్చి 23 -- ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ, రికార్డులను బ్రేక్ చేస్తోంది. కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఇక్కడ చూసేయండి.

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 బాక్సాఫీస్ ఊచకోత మామూలుగా లేదు. ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ ప్రకారం ఆదివారం (మార్చి 22) ఒక్కరోజే ఈ చిత్రం ఇండియాలో రూ.114.85 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో ధురంధర్ 2 మొత్తం ఇండియన్ కలెక్షన్లు రూ.454.12 కోట్లకు చేరుకున్నాయి. నాలుగు రోజుల్లోనే ఇండియాలో అదిరే వసూళ్లను రాబట్టింది ఈ సినిమా.

ధురంధర్ 2 మూవీ రికార్డుల దుమ్ము దులుపుతోంద...