భారతదేశం, మార్చి 7 -- ధురంధర్ 2 సినిమా రిలీజ్ కు ఇంకా 10 రోజుల పైనే ఉంది. కానీ అప్పుడే రికార్డుల వేటకు ఈ స్పై థ్రిల్లర్ రెడీ అయిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో దూకుడుతో బంపర్ ఓపెనింగ్స్ సాధించే దిశగా ధురంధర్ 2 దూసుకుపోతోంది. ప్రివ్యూ షోలతోనే ఈ మూవీకి రూ.25 కోట్ల కలెక్షన్లు వస్తాయన్నది అంచనా.

బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ సినిమాకు సీక్వెల్ గా ధురంధర్ 2 రాబోతుంది. మార్చి 19, 2026న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే అంతకంటే ఒక రోజు ముందు అంటే మార్చి 18న ధురంధర్ 2 ప్రివ్యూ షోలు వేయనున్నారు. ఈ షోల అడ్వాన్స్ టికెట్ల బుకింగ్స్ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి.

శనివారం (మార్చి 7) ధురంధర్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ధురంధర్ 2 మూవీ ప్రివ్యూ షోలకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ సేల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ టికెట్లు జెట్ స్పీడ్ లో అమ్ముడు పో...