భారతదేశం, ఏప్రిల్ 5 -- ప్రస్తుతం భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' ప్రభంజనం కొనసాగుతోంది. రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా నటించిన ఈ చిత్రం మూడో వారాంతంలో (Third Weekend) అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. శుక్ర, శనివారాల్లో వసూళ్లు ఒక్కసారిగా పుంజుకోవడంతో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు రూ. 1600 కోట్ల మార్కు దిశగా దూసుకుపోతోంది. హిందీ సినిమా చరిత్రలో ఇంతవరకు ఏ చిత్రానికీ సాధ్యం కాని రీతిలో, కేవలం భారత్‌లోనే రూ. 1000 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టేందుకు ఈ సినిమా సిద్ధమైంది.

మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టిన 'ధురంధర్ 2' మూడో వారం ప్రారంభం నాటికి రూ. 1500 కోట్ల మైలురాయిని దాటేసింది. 17వ రోజైన శనివారం (ఏప్రిల్ 4) నాడు ఇండియాలో రూ. 25.65 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది ధురంధర్ 2 చిత్రం.

శుక్రవారం నుంచి శనివారం నా...