భారతదేశం, మార్చి 19 -- ప్రస్తుతం సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా 'ధురంధర్ 2' మాటే వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సీక్వెల్‌లో రణ్‌వీర్ సింగ్ తన యాక్షన్‌తో అదరగొడుతుంటే, సీనియర్ నటుడు రాకేష్ బేడీ తన నెగటివ్ షేడ్ ఉన్న పాత్రతో సినిమాకే హైలైట్‌గా నిలిచారు. కరాచీకి చెందిన కుట్రలు, కుతంత్రాలు పన్నే రాజకీయ నాయకుడు 'జమాలి' పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి.

ఇటీవల 'ఇండియా పాడ్‌కాస్ట్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ బేడీ షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా చివరి రోజున రణ్‌వీర్ సింగ్ మైక్ తీసుకుని యూనిట్ అందరి ముందు తన గురించి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేసుకున్నారు.

"ఈ సినిమా ఒకవేళ వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తే.. అందులో రూ. 500 కోట్లు కేవలం రాకేష్ జీ వల్లే వస్తాయి" అని రణ్‌వీర్ సింగ్ అన్నట్లు రాకేష్ బ...