భారతదేశం, మార్చి 21 -- బాలీవుడ్ పవర్‌హౌస్ రణ్‌వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా మార్చి 19న గ్రాండ్‌గా విడుదలై యాక్షన్ ప్రియులను థ్రిల్ చేస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక వింత వైరల్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఖుషి బాత్రా అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌లో ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. రాత్రి 11 గంటల షోలో ఒక మహిళ.. రణ్‌వీర్ సింగ్ సినిమా ధురంధర్ 2 చూస్తూనే తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ కనిపించింది. థియేటర్ అంతా చీకటిగా ఉండటంతో ఆ ల్యాప్‌టాప్ స్క్రీన్ వెలుగు ఇతర ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

ఈ సంఘటనపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా స్పందిస్తున్నారు. "వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్తా వర్క్ ఫ్రమ్ థియేటర్ అయిపోయింది" అని కొ...