భారతదేశం, మే 4 -- Dhurandhar 2: ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. సినిమా విడుదలై ఏడు వారాలు కావస్తున్నా.. కలెక్షన్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. తాజాగా ఆదివారం (మే 3) నాడు ఈ సినిమా ఎస్.ఎస్. రాజమౌళి దృశ్యకావ్యం 'బాహుబలి 2: ది కన్క్లూజన్' లైఫ్ టైమ్ కలెక్షన్ల రికార్డును అధిగమించింది. దీంతో భారత సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా ధురంధర్ 2 నిలిచింది.

మే 3వ తేదీ ఆదివారంతో ఈ ధురంధర్ 2 థియేటర్లలో 46 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వారంలో కొత్త సినిమాలు విడుదల కావడంతో ధురంధర్ 2 థియేటర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 500 కంటే తక్కువకు పడిపోయింది.

దీనివల్ల రోజువారీ వసూళ్లు రూ. 1 కోటి నుంచి రూ. 1.5 కోట్ల మధ్యకు తగ్గాయి. అయినప్పటికీ ఇప్పటివరకు ఈ సి...