భారతదేశం, ఏప్రిల్ 1 -- ర‌ణ్‌వీర్ సింగ్‌ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ "ధురంధర్ 2" బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. రెండో వారంలోనూ ఈ మూవీ తగ్గేదేలేదన్నట్లుగా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తోంది. 13వ రోజు (మార్చి 31) ముగిసే సమయానికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1435 కోట్ల మార్కును దాటేసింది. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.

ధురంధర్ 2 సినిమా కలెక్షన్ల పరంగా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. చైనా మార్కెట్ మినహాయించి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాగా ధురంధర్ 2 నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1435 కోట్ల కలెక్షన్లను ఖాతాలో వేసుకుంది.

చైనాను కలిపి చూసుకుంటే అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా దంగల్ కొనసాగుతోంది. చైనాలోనే ఈ మూవీ రూ.1300 కోట్లు సాధించింది. కానీ ధ...