భారతదేశం, ఏప్రిల్ 2 -- ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' సీక్వెల్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద కనివిని ఎరుగని రీతిలో దూసుకుపోతోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం కేవలం పది రోజుల్లోనే పార్ట్-1 లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ చిత్రం ఇండియాలో రూ.900 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.1,400 కోట్లకు పైగా వసూలు చేసి గ్లోబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ధురంధర్ సినిమాల్లో సంజయ్ దత్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. పాకిస్థాన్ లోని కరాచీ ఎస్పీ చౌదరి అస్లాం పాత్రను సంజయ్ దత్ పోషించాడు. చౌదరి అస్లాం ఇప్పటికే మరణించాడు. అయితే సంజయ్ దత్ ఈ చిత్రంలో పాకిస్థాన్ పోలీస్ ఆఫీసర్ చౌదరి అస్లాం పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ధురంధర్ సినిమాల్లో తన భర్త క్యారెక్టర్ పోషించిన సంజయ్ దత్ గురించి చౌదరి అస్లాం భార...