భారతదేశం, మార్చి 28 -- బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధురంధర్ 2పై ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ఈ మూవీపై విమర్శలు గుప్పించారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ చిత్రం కేవలం 'బక్వాస్' (అర్థం లేనిది) అని కొట్టిపారేశారు.

రీసెంట్ గా టైమ్స్ నౌ సమ్మిట్‌లో అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ధురంధర్ చిత్రాల గురించి అడిగినప్పుడు ఆయన.. "అది కూడా ఒక సినిమానా? మూడు గంటల టైమ్ వేస్ట్. బక్వాస్'' అని బదులిచ్చారు. తనకు మూడు గంటల పాటు సినిమా చూసే సమయం లేదని, ప్రజలు తన మాటలను ఒక గంట వింటే చాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ధురంధర్ 1, ధురంధర్ 2 సినిమాలు సమాజంలో హింసను ప్రోత్సహిస్తున్నాయని ఒవైసీ ఆరోపించారు. మూడు గంటల సినిమా చూశాక, ముస్లింలను తిట్టాలా వద్దా అని ప్రేక్షకులు ఆలోచించేలా...