Dhruva Natchathiram: ఈ సినిమాను జూన్ 15లోపు రిలీజ్ చేయాల్సిందే.. లాభాలతో అప్పులు తీర్చండి: మద్రాస్ హైకోర్టు తీర్పు
భారతదేశం, ఏప్రిల్ 30 -- Dhruva Natchathiram: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అభిమానుల నిరీక్షణ ఫలించింది. ఎన్నో ఏళ్లుగా ల్యాబ్ లకే పరిమితమైన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధృవ నచ్చత్తిరమ్' విడుదలలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. భారీ బడ్జెట్, ఆర్థిక ఇబ్బందులు, ఇతర న్యాయపరమైన చిక్కులతో 2017 నుంచి ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మద్రాస్ హైకోర్టు వెలువరించిన కీలక తీర్పుతో ఈ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కింది.
విక్రమ్ నటించిన ధృవ నచ్చత్తిరమ్ సినిమా వ్యవహారంపై విచారణ చేపట్టిన జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి.. ఈ ఏడాది జూన్ 15 లోపు చిత్రాన్ని తప్పనిసరిగా థియేటర్లలో విడుదల చేయాలని ఆదేశించారు.
అంతేకాకుండా ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని కోర్టు పర్యవేక్షణలోనే ఉంచాలని, ఆ సొమ్ముతో 2017 నుంచి పెండింగ్లో ఉన్న అప్పులన్నీ తీర్చాలని స్పష్టం చేశారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.