భారతదేశం, అక్టోబర్ 10 -- ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్​ రాఠీని దిల్లీ, గురుగ్రామ్ పోలీసులు శనివారం ఉదయం అదుపులో తీసుకున్నారు. గురుగ్రామ్ సెక్టార్ 56లోని ఆయన నివాసం నుంచి పోలీసులు ధ్రువ్​ రాఠీని డీటైన్ చేశారు.

దిల్లీలో ఇంకొద్దిసేపట్లో ప్రారంభంకానున్న సీజేపీ నిరసనల్లో పాల్గొనేందుకు సన్నద్ధం అవుతున్న ధ్రువ్​ రాఠీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శనివారం భారీ నిరసనలకు పిలుపునిచ్చింది.

దిల్లీ నిరసనల నేపథ్యంలో సీజేపీ ఫౌండర్​ అభిజిత్ దీప్కే, ప్రతినిథి సౌరవ్​ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

గురుగ్రామ్​ సెక్టర్​ 56లోని కేంద్రీయ పార్క్ విహార్​లో ధ్రువ్​ రాఠీ నివాసం ఉంది. అనేక మీడియా కథనాల ప్రకారం.. ఆయన ఇంటి వద్ద శుక్రవార...